తట్టేపల్లిలో విద్యుత్ సంక్షోభం.. మొబైల్ చార్జింగ్ కోసం ఎగబడిన జనం

-

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. తుపాన్ మాదిరిగా గాలులు వీచడంతో పాటు కారు మబ్బులు కమ్ముకున్నాయి. గంటల పాటు కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో విద్యుత్ వైర్లు తెగడంతో రెండు రోజులుగా కరెంటుకు అంతరాయం కలిగింది. తాగునీటి ఇబ్బందులతో యువకులు చందాలతో డీజిల్ జనరేటర్ తెచ్చి, బోర్లు, మొబైల్ చార్జింగ్‌కు సాకెట్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news