ఉమ్మడి నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఇటీవల మరణించిన మల్లీశ్వరి ఆత్మహత్య ఘటనలో ఇప్పటివరకు మిగతా నిందితులు ఎవరూ అరెస్ట్ కాలేదని..కేసు పరిశోధన నత్తనడక సాగడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
దిశ అనే యువతి హత్యాచారం కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేశారని.. ఆమెకు ఒక న్యాయం- మల్లీశ్వరికి మరో న్యాయమా?? అని ప్రశ్నించారు.రాచకొండ పోలీసులు కనీసం యువతి తల్లితండ్రుల స్టేట్ మెంట్‌ను మెజిస్ట్రేట్ వద్ద రికార్డు కూడా చేయలేదని..
అమ్మాయి ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి సంబంధించిన ఆధారాలు వాట్సాప్ స్క్రీన్ షాట్స్, కాల్ డిటైల్స్ కూడా సేకరించలేదని నేడు ఉన్నతాధికారులతో మాట్లాడితే అర్థమైందన్నారు.అసలు ఇప్పటివరకు సరూర్ నగర్ పోలీసులు బాధిత యువతి కుటుంబాన్ని, ఆ గ్రామాన్ని సందర్శించ లేదని.. తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉన్నదా? హోంమంత్రి ఉన్నడా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.