వాహనాలపైకి దూసుకెళ్లిన నటుడు బాబీ సింహా కారు

-

తమిళ నటుడు బాబీ సింహా కారు ఎక్కడుతంగల్‌ – చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో అదుపుతప్పి ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో అలందూర్ మెట్రో స్టేషన్ వైపు ఉన్న కత్తిపార ఫ్లై ఓవర్ దిగుతుండగా కారు అదుపుతప్పింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది.

అయితే ఈ ప్రమాదంలో ఆటోలు, బైకులు, కార్లు సహా ఆరు వాహనాలు దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ పుష్పరాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రైవర్ మద్యం సేవించి మత్తులో కారు నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటుడు కారులో లేడని పోలీసులు తెలిపారు. బాబీ సింహా.. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, కమల్‌ హాసన్‌ నటించిన ‘భారతీయుడు-2’, రవితేజ ‘డిస్కో రాజా’, రజాకార్‌ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే.

Read more RELATED
Recommended to you

Latest news