ఉత్తర భారతంలోని జమ్ముకాశ్మీర్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలు కురుస్తుండటంతో గ్రామాలకు గ్రామాలు మునిగిపోయాయి. జమ్ము రాష్ట్రాన్ని ఆకస్మిక వర్షాలు ముంచెత్తడంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలోనే రాంబన్ జిల్లా ధర్మకుండ్ సమీపంలోని నాలా ఉప్పొంగి గ్రామాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వరదల ధాటికి కొండచరియలు విరిగిపడి రహదారులు, ఇళ్లు కొట్టుకుపోయాయి.దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసేశారు. అంతేకాకుండా భారీ వాహనాలు సైతం నీట మునిగాయి. కేంద్రం సైతం జమ్ములో కురుస్తున్న వర్షాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. వేగంగా రక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.