ఆ సినిమాలో దారుణంగా నటించా… అంటూ హీరోయిన్ సమంత సంచలన కామెంట్స్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత ప్రస్తుతం ఫుల్లు బిజీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సామ్ ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఒక్క సినిమాలే కాకుండా వెబ్ సిరీసుల్లో సైతం సామ్ మెరుస్తున్నారు.

అయితే, తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రొడ్యూసర్ అవతారమెత్తి నిర్మిస్తున్న మొదటి సినిమా ‘శుభం’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘వీళ్ల యాక్టింగ్ చూస్తుంటే నేను కెరీర్ మొదట్లో చేసిన సినిమాల్లో యాక్టింగ్ చూసి ఇప్పుడు నాకు సిగ్గేస్తుంది. ఏమాయ చేసావే సినిమా ఇప్పుడు చూస్తే ఇంత దారుణంగా నటించానా అనిపిస్తుంది. ఇప్పటికీ యాక్టింగ్‌లో కొత్తగా చేయడం నేర్చుకోవాలి’ అని అన్నారు హీరోయిన్ సమంత.