భార్యాభర్తలు పెళ్లి తర్వాత ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే, ఎన్నో కారణాల వలన వారి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా, కొంతమంది మగవారు పెళ్లి అయిన కొన్ని రోజులకే ఇతర స్త్రీలను చూస్తూ ఉంటారు. ఈ విధంగా పరాయి స్త్రీలను ఇష్టపడటం వలన, భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా, మరికొందరు ఇతర స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైతే భర్త మరొక స్త్రీతో చనువుగా మాట్లాడతారో, భార్య ఎంతో ఆందోళన చెందుతుంది. ముఖ్యంగా పురుషులు అలా ప్రవర్తించడానికి గల కారణాలను ఆడవారు తెలుసుకోవాలి.
చాణక్య నీతిలో, జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పినా సరే, భార్యాభర్తల సంబంధానికి మరింత ప్రాముఖ్యత ఉంది. మగవారు మరియు ఆడవారు ఒకరినొకరు ఆకర్షించుకోవడం సహజమే. కాకపోతే, పెళ్లి అయిన తర్వాత కూడా ఇదే కొనసాగితే, బంధం పై ప్రభావం పడుతుంది. కనుక, ఆకర్షణ పై నియంత్రణ ఎంతో అవసరం. ఎప్పుడైతే చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంటారో, ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వయసులో అవగాహన అస్సలు ఉండదు. అంతేకాకుండా, కెరీర్‌పై ఎక్కువ సమయాన్ని కేటాయించడం వలన, జీవిత భాగస్వామి పై శ్రద్ధ తగ్గుతుంది.
దీంతో, కొన్ని రోజులకే కోరికలు మారిపోతాయి మరియు ఇతరులను ఆకర్షిస్తారు. అదేవిధంగా, శారీరక సంబంధాలు సంతృప్తికరంగా లేకపోయినప్పుడు, ఇతర స్త్రీలను ఆకర్షిస్తారు.
దీంతో వైవాహిక సంబంధం బలహీనంగా మారుతుంది. ఎప్పుడు కూడా భార్యభర్తలు ఎంతో నిజాయితీగా ఉండాలి. ఇలా ఉండడం వలన, ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది.
దీంతో, సంబంధం చెడిపోకుండా ఉంటుంది. పెళ్లి తర్వాత, ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత భర్త భార్యకు దూరమవుతాడు మరియు భార్య, పిల్లలకు దగ్గరవుతుంది. ఈ ప్రక్రియలో భర్త పై శ్రద్ధ తగ్గడం, తక్కువగా మాట్లాడటం వలన మరొక స్త్రీలను ఆకర్షించే అవకాశం ఉంటుంది అని చాణిక్యుడు చెప్పడం జరిగింది.