ఈ తరం విద్యార్థులకు గురువుల విలువ తెలియడం లేదు.వారికి గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు కానీ వారి విలువను తోటి విద్యార్థుల ముందు తీసేస్తున్నారు.ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలో వెలుగుచూసింది. ఓ విద్యార్థిని ఏకంగా టీచర్‌ను చెప్పుతో కొట్టబోయిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ ఘటన విజయనగరంలోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగింది.టీచర్ తన ఫొన్ తీసుకుందని.. దాని విలువ రూ.12 వేలు అంటూ విద్యార్థిని టీచర్‌ను బూతులు తిడుతూ ఆమెతో గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా? చెప్పుతో కొట్టమంటావా? అంటూ చెప్పు తీసింది.టీచర్ ఇవ్వను అనేసరికి.. సహనం కోల్పోయిన విద్యార్థిని టీచర్‌పై తన చెప్పుతో దాడి చేసినట్లు తెలిసింది. దీంతో టీచర్ సైతం స్టూడెంట్‌పై చేయిచేసుకుంది.వెంటనే అక్కడ ఉన్నవారు వారిని కంట్రోల్ చేశారు. విద్యార్థిని బలవంతంగా మొబైల్ ఫొన్ టీచర్ నుంచి లాక్కుంది. దీనికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.