ఉగ్రవాదులు ఎప్పుడూ ఎలా వ్యవహరిస్తారో ఎవ్వరూ ఊహిచంలేరు. అదును చూసి ఘాతుకానికి పాల్పడ్డారు. కాశ్మీర్ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టులను టార్గెట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ బాధితులు వీడియోలు అందరిచే కన్నీరు తెప్పిస్తున్నాయి. ఎంతో ఆనందంగా ముగియాల్సిన ట్రిప్, ఉగ్రవాదుల మూలంగా అంతా తారుమారైంది. అప్పటివరకు సంతోషంగా కాశ్మీర్ అందాలను, హిమాలయాలను, పచ్చని చెట్లు, గడ్డి భూములు చూస్తున్న టూరిస్టులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు.
ఈ దాడిలో ఇప్పటివరకు ఒకరు మరణించినట్టు 12 మంది గాయపడినట్టు అధికారిక సమాచారం. మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడికి లష్కరే తొయిబా ప్రాక్సీ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రసంస్త బాధ్యత ప్రకటించింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోల, ఫొటోల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధిత టూరిస్టులు తమ వారిని కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.