ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ మోహన్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి.

ఈ మేరకు దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. దింతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఊహించని షాక్ తగిలింది. అటు గతంలో పవిత్రమైన తిరు మాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని వైసీపీ మాజీ నేత, ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికపై ఆరోపణ వచ్చాయి. దీంతో BNS 292,296, 300 సెక్షన్ 66 -200-2008 కింద వైసీపీ మాజీ నేత, ఎమెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురిపై కేసు నమోదు అయింది.