జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ అధికారి మృతి చెందారు. మృతుడు ఐబీ అధికారి మనీష్ రంజన్‌గా గుర్తించారు. తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. హైదరాబాద్‌లో ఐబీ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు మనీష్ రంజన్.

పర్యటన కోసం కాశ్మీర్ వెళ్లిన మనీష్ రంజన్ ను తన భార్య, ఇద్దరు పిల్లల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. కాగా, మంగళవారం అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు. కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు.. టూరిస్టులను అక్కడినుంచి తరలించారు.