కాల్పులు జరిగిన ప్రదేశానికి అమిత్ షా వెళ్లారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలతో మాట్లాడారు. కాగా ఈ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా పహల్గామ్ ఉగ్రదాడికి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర చేసిన టెర్రరిస్ట్ ను గుర్తించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. వీరితో పాటు రంగంలోకి దిగిన NIA బృందాలు… చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాగా, మంగళవారం అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్ పేర్కొనే పహల్గాంలోని బైసరన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశారు.