ఉగ్రదాడిలో కొత్తగా పెళ్లైన జంట మరణించిందని.. ఇదే వారి ఆఖరి హనీమూన్ అని సోషల్ మీడియా, జాతీయ మీడియాల్లో ప్రసారం అవుతున్న అసత్య కథనాలపై అసలైన జంట స్పందించింది. వేరొకరి స్థానంలో తమ పేర్లను ఎందుకు వాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు.
‘TRP కోసం అసత్యాలు ప్రసారం చేస్తారా? ఆ హనీమూన్ వీడియో ఉగ్రదాడిలో చనిపోయిన IAF ఆఫీసర్ది కాదని..మరో జంటది.మేము బ్రతికే ఉన్నాం, ఆ వీడియో మాది, ఆ ఘటన సమయంలో మేమక్కడ లేము అని పేర్కొన్నారు.భారత మీడియా ఎలా పని చేస్తుందో మాకు అర్థం కావట్లేదంటూ వీడియోను రిలీజ్ చేశారు. కాగా, మీడియా కథనాలపై నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.