నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటను చేతిలో పట్టుకొని రైతులు పంట పొలాల్లో ఆందోళనకు దిగారు. సాగు నీరు లేక పంటలు ఎండుతున్నాయని..పంట పొలాల్లో రైతుల ఆందోళన బాట పట్టారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి భైంసా గడ్డన్న వాగు ప్రాజెక్ట్ కెనాల్ ద్వారా నీటిని వదలాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నీరు వదలకపోవడంతో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రాజెక్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా నీటిని వదిలి పంటలను కాపాడాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.