మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ షాదీ డాట్‌ కామ్‌ పై కేసు నమోదు

-

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ షాదీ డాట్‌ కామ్‌(Shadi. Com)పై కేసు నమోదు అయింది. ఫేక్ ప్రొఫైల్స్‌కి అమ్మాయిల డేటా షేర్ చేసింది షాదీ డాట్ కామ్. దింతో వెబ్‌సైట్ డైరెక్టర్, మేనేజర్‌తో పాటు టీమ్ లీడర్లపై కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే ప్రొఫైల్ పెట్టి మోసాలకు పాల్పడ్డ వంశీకృష్ణ కేసులో చర్యలు తీసుకున్నారు. వంశీకృష్ణకు 20 మంది అమ్మాయిల ప్రొఫైల్స్‌ షేర్ చేశారు షాదీ డాట్‌ కామ్.

Case registered against matrimony website Shaadi com

గతంలో వంశీకృష్ణ ఓ మహిళా డాక్టర్‌ని మోసం చేసిన కేసులో నిందితుడుగా ఉన్నారు. ఈ తరహా ఫేక్ ప్రొఫైల్స్ మోసగాళ్లకి అమ్మాయిల డేటా షేర్ చేసినందుకు ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు నమోదు అయింది. షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్‌లపై కేసులు నమోదు నమోదు అయ్యాయి. ఇక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ షాదీ డాట్‌ కామ్‌(Shadi. Com)పై కేసు నమోదు అయిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news