మాజీ మంత్రి పెద్దిరెడ్డి మరో ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ ఘటనలో ప్రధాన కుట్రదారుగా మాధవరెడ్డిపై సీఐడీ అభియోగాలు మోపింది.

నెల రోజులుగా పరారీలో ఉన్నారు మాధవరెడ్డి. అయితే తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు వద్ద తన ఫాంహౌస్‌లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు సీఐడీ పోలీసులు. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అయిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.