తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని పేర్కొన్నారు డీజీపీ జితేందర్. ఈ నెల 27 తర్వాత పాకిస్థానీల వీసాలు పని చేయవు అని ప్రకటించారు డీజీపీ జితేందర్. మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంటుందన్నారు.

లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు డీజీపీ జితేందర్.
- తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి: డీజీపీ జితేందర్
- ఈ నెల 27 తర్వాత పాకిస్థానీల వీసాలు పని చేయవు
- మెడికల్ వీసాల మీద ఉన్న వారికి ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు
- లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదు
- కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన డీజీపీ