బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు వరంగల్లోని ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు. తాజాగా కేసీఆర్ సభపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు.కేసీఆర్ సభ మరో మేడారం జాతరను తలపిస్తుందని.. జాతరకు ప్రజలు ఎలా తరలి వెళ్తారో మా సభకు కూడా అలానే వస్తారన్నారు. 25ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పండుగకు ఊరు, వాడ, పల్లె, పట్టణం కదులుతుందని తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా సంతోషంతో వస్తారని.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి దాకా అందరికీ సంక్షేమాన్ని అందించిన పార్టీ బీఆర్ఎస్ అని కొనియాడారు. లగచర్ల, HCU అంశాల్లో బీఆర్ఎస్ బాధితుల పక్షాన పోరాటం చేసిందన్నారు.అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల పక్షమే అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగి పోయారన్నారు మాజీ ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.