జమ్ముకాశ్మీర్లోని పహెల్గాం జిల్లాలో 26 మంది టూరిస్టులను పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ కాల్పుల్లో తన భర్తను కోల్పోయిన ఏపీకి చెందని మహిళ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
‘అవును.. మా మతం అడిగి, కాల్చి చంపింది ముస్లింలే.. కానీ, మేము సురక్షితంగా బయటపడేలా సహాయం చేసింది కూడా ముస్లింలే. డ్రైవర్ దగ్గర నుంచి ఎయిర్పోర్టు దాకా.. మాకు హెల్ప్ చేసిందంతా ముస్లింలే. అంతెందుకు.. మా వీధిలో ముస్లింలతోనే కలిసి పెరిగాం’ అని ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ భార్య వెల్లడించారు. ఇదిలాఉండగా, ఈ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.