కొందరు రీల్స్ పిచ్చిలో ఏం చేస్తున్నారో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. గతంలో కొందరు ఆకతాయిలు ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ కారును ఎత్తుకెళ్లి మరీ అందులో రీల్స్ చేశారు. అప్పట్లో అది కాస్త వైరల్ అయ్యింది. తాజాగా మరోసారి పోలీస్ వాహనంలో రీల్స్ తీశారు ఓ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు.
ఈ ఘటన నిజామాబాద్‌లో శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.ఒక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా వీడియో తీసి రీల్స్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు.అలాగే కోర్టుకెళ్తున్న సమయంలో మరో వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ak46 sameer khan ఖాతాలో అప్‌లోడ్ చేశారు. విషయం తెలియడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.