లండన్లోని పాకిస్తాన్ హైకమిషన్ ఎదుట అక్కడి ప్రవాస భారతీయులు నిరసన చేపట్టారు. జమ్ముకాశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారతీయుల నిరసన ప్రదర్శన చేపట్టారు. కాగా, జమ్మూకశ్మీర్లోని పహెల్గాంలో జిల్లాలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నది.దేశంలోని పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేసింది.అంతేకాకుండా ఇప్పటికే పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్లో పాకిస్థాన్ హై కమిషన్ ముందు భారతీయులు ఆందోళన నిర్వహించారు.అనంతరం నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.