లక్నో పై ఘన విజయం సాధించిన ముంబై ఇండియన్స్

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 2 స్థానానికి వెళ్లింది ముంబై. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ మధ్య జరిగే మ్యాచ్ లో విన్ అయిన జట్టు ఏకంగా నెంబర్ వన్ స్థానానికి వెళ్తోంది. దీంతో మళ్లీ ముంబయి జట్టు మూడో స్థానానికి పరిమితం కానుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 215 పరుగులు చేసింది. ముంబయి బ్యాటర్లలో రికెల్టన్ 58, సూర్యకుమార్ యాదవ్ 54, విల్ జాక్స్ 29, నమన్ 25, బోస్ 20 పరుగులు చేయడంతో ముంబై భారీ స్కోర్ చేయగలిగింది. ఇక 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 161 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. మిచెల్ మార్ష్ 34, అయూస్ బదోనీ 35, నికోలస్ పూరన్ 27, డేవిడ్ మిల్లర్ 24, రవి బిష్ణోయ్ 13 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. దీంతో లక్నోకి ఓటమి తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Latest news