పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపింది ఇండియా. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో 16 పాకిస్థానీ యూ ట్యూబ్ ఛానళ్లను నిషేధించింది భారత్. సైన్యం, భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలను వ్యాప్తి చేస్తుండటంతో చర్యలు తీసుకుంది ఇండియా.

హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు డాన్ న్యూస్, సమా టీవీ, ఆరీ న్యూస్ సహా 16 ఛానళ్లపై నిషేధం విధించింది ఇండియా. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడి కేసు విచారణ బాధ్యతలు NIAకి అప్పగించారు. దింతో పహల్గామ్ ఉగ్రదాడి కేసులో రంగంలోకి దిగింది NIA. ఏప్రిల్ 23 నుంచి ఈ ఘటనకు సంబంధించి NIA ఆరా తీస్తున్నట్టు సమాచారం అందుతోంది.