మియాపూర్ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు మీద నుంచి వెళ్లడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్‌లోఉండే హైదర్ షరీఫ్ (68), రెహమాన్ షరీఫ్ (65) అన్నదమ్ములు.నిన్న రాత్రి కేపీహెచ్‌బీ నుంచి మియాపూర్ వైపు బైకు మీద వెళ్తుండగా మెట్రో పిల్లర్ 636 వద్దకు వీరి వాహనం అదుపుతప్పింది.
దీంతో ఇద్దరూ కిందపడిపోయారు.ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు వారి మీద నుంచి వెళ్లింది.ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.