వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. నిన్న సభలో కేసీఆర్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. మళ్లీ అధికారంలోకి వస్తాం అని పాపం కేసీఆర్ పగటి కలలు కంటున్నారు.
రూ.500 కోట్లతో సభ పెట్టిన వాళ్లు అవినీతి గురించి మాట్లాడుతున్నారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు సన్న బియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఇవాళ తెలంగాణలో ఎన్నో మంచి కార్యక్రమాలు అమలు అవుతున్నాయి’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే.