హిందువులకు ఎన్నో సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఉంటాయి. ప్రతి పండుగకు మరియు శుభకార్యాలకు ఎన్నో విషయాలను పాటిస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని ఎంతో మంది నమ్ముతారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వలన ఎంతో మంచి జరుగుతుందని, ఆర్థికంగా దృఢంగా మారుతారని భావిస్తారు. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన రావడం జరిగింది. ఈ రోజున ఏ పని చేసినా విజయాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతారు. అయితే సహజంగా అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని ఎక్కడా లేదని, కేవలం వ్యాపారం కోసం కొంతమంది ఇలా చేస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు.
కాకపోతే ఈ ప్రక్రియలో అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం అనేది సాంప్రదాయంగా కాకుండా ఒక సెంటిమెంట్ లాగా మారింది. అయితే కొంతమంది తక్కువ మోతాదులో బంగారం కొనుగోలు చేసినా ఎంతో మంచి ఫలితం వస్తుందని భావిస్తూ ఉంటారు. కాకపోతే మరికొందరు వీటిని పాటించరు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలి అని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున నీళ్లతో నింపిన కుండలను బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తే చనిపోయిన పూర్వీకులకు ఈ దానం వెళ్తుందని పండితులు చెబుతూ ఉంటారు.
వీటితో పాటుగా గొడుగు, చెప్పులు, విసనకర్ర, బట్టలు వంటి వాటిని దానం చేయడం వలన ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు. వేసవికాలంలో ఇటువంటివి దానం చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉధుకుంభదానం ను అక్షయ తృతీయ రోజున చేయడం వలన మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. ఇటువంటివి దానం చేయడంతో పాటుగా చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ విధంగా ఇతరులకు సహాయం చేయడం వలన ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు. కనుక అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనడం కాకుండా ఇటువంటివి పాటించండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి.