మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కీలక వ్యాక్యలు చేశారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీతక్క గారు మీరంటే గౌరవం కానీ నిన్న మీరు మాట్లాడిన తీరు చుస్తే మీ పై గౌరవం పోయింది.
బీజేపీ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను ఊచకోత కొస్తుంటే.. ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తిగా ఆలా అధికారం ఉందని చంపుకుంటూ పొతే కాదు. వారిని పిలిచి చర్చలు జరపండి అని మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రశ్నిస్తే ఉద్యమం నుండి వచ్చిన మీరు అభినందించాల్సింది పోయి సీఎం రేవంత్ మెప్పు కోసం కేసీఆర్ గారిపై తప్పుగా మాట్లాడుతారా? సీతక్కను ప్రశ్నించారు. మాజీ నక్సలైట్‌గా మీరు హక్కుల కోసం పోరాడారు? మీకు తెలీదా? కేంద్రం మావోయిస్టులను ఎలా ఏరివేస్తుందో అని మంత్రి సీతక్కను ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ నిలదీశారు.