హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. తన నియోజకవర్గంలో ఎంతో కాలంలో పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా బ్రిడ్జిలు లేక ద్వీపంలో మాదిరి తమ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండల పెర్కెపల్లిలో రూ.347 కోట్ల 45 లక్షలతో పెర్కెపల్లి నుండి వెన్కేపల్లి వెళ్ళే రోడ్డుపై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.పెర్కెపల్లి నుంచి దుద్దెనపల్లి వెళ్ళే రోడ్డుపై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం ఈ మేరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పొన్నం ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.ఎట్టకేలకు మంత్రి ప్రకటనతో నియోజక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.