తెలంగాణ ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించలేదని ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది.
భయ్యా కనకయ్య అలియాస్ దుర్గాప్రసాద్ (33) అనే వ్యక్తి ఇటీవల నిర్వహించిన ప్రజావాణిలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని.. లబ్దిదారుల లిస్టులో తన పేరు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. గ్రామ నాయకులు డబ్బులు తీసుకొని తనను మోసం చేశారని ఆరోపించాడు. ఈ మేరకు సమచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో ఆ యువకుడు కిందకు దిగినట్లు తెలుస్తోంది.