పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన మధు కుటుంబానికి పవన్‌ కల్యాణ్‌ సాయం

-

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన మధు సుధాన్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రూ. 50 లక్షలు ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మధు సుధన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామన్నారు పవన్‌ కల్యాణ్‌. పాకిస్తాన్ వెళ్లిపోండి అంటూ ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. 26 మందిని మతప్రాతిపదికన చంపితే సో కాల్డ్ సెక్యులర్ వాదులు మతం అడిగి చంపలేదంటున్నారన్నారు.

Deputy CM Pawan Kalyan announces Rs. 50 lakhs on behalf of Jana Sena Party to the family of Madhu Sudhan, who lost his life in the Pahalgam terror attack

పాకిస్తాన్‌ను మీరు అంతగా ప్రేమిస్తే పాకిస్తాన్ వెళ్లిపోండి. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అని తెలిపారు ఏపీ డిప్యుటీ సీఎం, పవన్ కల్యాణ్. వివక్ష చూపిస్తే కోట్ల మంది ముస్లింలు ఇక్కడ ఉండేవారా? అన్నారు పవన్ కల్యాణ్. పాకిస్తాన్‌లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారత్‌లో కూడా అంతే ఉంది… నిజంగా హిందువులు వివక్ష చూపిస్తే ఇంత ముస్లిం జనాభా ఉండేదా? అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news