జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులకు అవకాశం !

-

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులకు అవకాశం ఉందని సమాచారం అందుతోంది. కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని 48 టూరిస్టు కేంద్రాలను మసివేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఇళ్లను సైన్యం టార్గెట్ చేసి పేల్చేస్తుండటంపై పెద్దయెత్తున ఉగ్రవాదులు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం అందుతోంది.

There is a possibility of terrorist attacks again in Jammu and Kashmir
There is a possibility of terrorist attacks again in Jammu and Kashmir

ముందస్తు చర్యల్లో భాగంగా కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. అటు పహల్గామ్ దాడికి పాల్పడ్డ నలుగురిలో ఓ ఉగ్రవాదిపై క్లారిటీ వచ్చింది. ఉగ్రవాదుల్లో ఒకరైన హషిమ్ మూసా.. పాక్ సైన్యంలో మాజీ పారా కమాండో అని దర్యాప్తులో వెల్లడించారు. ప్రస్తుతం అతడు కరుడుగట్టిన టెర్రరిస్టుగా మారినట్లు పేర్కొన్నాయి దర్యాప్తు బృందాలు. పాక్‌కు చెందిన లష్కరే తోయిబాతో కలిసి అతడు పని చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news