ఇవాళ విజయవాడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

విజయవాడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విజయవాడకు వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి విజయవాడకు వెళుతున్నారు.

Chief Minister Revanth Reddy to visit Vijayawada today
Chief Minister Revanth Reddy to visit Vijayawada today

ఇవాళ ఉదయం 9.15కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి, 10.40 గంటలకు కానూరు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణానికి చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10.50 నుంచి 11.30 వరకు జరిగే వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దేవినేని ఉమా, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కుమారుని వివాహానికి ఆహ్వాన పత్రికను అందజేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news