సింహాద్రి అప్పన్న సంఘటన పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలపై ఆదేశాలు ఇచ్చారన్నారు. స్వామివారి నిజరూప దర్శనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేశామని అందరూ చెబుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తే అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పామన్నారు.

అందువల్లే ఆయన అక్కడికు వెళ్ళలేదని వెల్లడించారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ రోజు రాత్రి 12 గంటల లోగా నిజరూప దర్శనం పూర్తవుతుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మరణించిన వారికి 25 లక్షల రూపాయల చొప్పున…ఎక్స్ గ్రేషియా ప్రకటించారన్నారు. గాయాల పాలైన వారికి ఖర్చుతోనే వైద్యం అందిస్తుందన్నారు. అంతేగాక మూడు లక్షల రూపాయలు మేర ఎక్స్ గ్రేషియా కూడా ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యులకు దేవాదాయశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశం అని తెలిపారు.