మరో ఘటన.. కాబోయే అల్లుడితో అత్త లేచిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోండా జిల్లాలోని ఖొడారే పోలీస్ స్టేషను పరిధిలో గల గ్రామానికి చెందిన యువతికి బస్తీ జిల్లాకు చెందిన యువకుడి (25) తో మే 9వ తేదీన వివాహం జరిగేలా నాలుగు నెలల కిందట పెద్దలు నిశ్చయించారు.

ఈ సంబంధం కుదిరిన నాటి నుంచీ వధువు తల్లికి, కాబోయే అల్లుడికి మధ్య ఫోను సంభాషణలు ఎక్కువయ్యాయి. అయితే విషయం తెలుసుకొని యువతి కుటుంబం ఈ పెళ్లిని రద్దు చేసుకొని, మరో సంబంధం కూడా కుదుర్చుకొంది. అయినా వారి ఫోను సంభాషణలు ఆగలేదు.. ఈ నేపథ్యంలో వారిద్దరూ అదృశ్యం అయ్యారు. పలుచోట్ల వెతికి చివరకు పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు.