కాంగ్రెస్‌లో కోట్లాట.. మంత్రి కారులో ఎమ్మెల్యేను కొట్టిన ఎంపీ

-

అధికార కాంగ్రెస్ పార్టీలో కోట్లాటలు కామన్. ఆ పార్టీ చరిత్రలోనే కుటిల రాజకీయాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని ఎంపీ మల్లు రవి కొట్టినట్లు సమాచారం. ఎమ్మెల్యే కూడా తిరిగి ఎంపీ మీద దాడి చేసినట్లు సమాచారం.గద్వాల కాంగ్రెస్ నాయకురాలు సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకు రాకుండా, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలిసింది.

ఇప్పటికే పలుసార్లు ప్రోటోకాల్ రగడ కాగా మంత్రి జూపల్లి సర్దిచెప్పాలని చూడగా.. ఇటీవల భూభారతి రైతు అవగాహన సదస్సులో గొడవ కాగా మంత్రి పొంగులేటి కారులో గన్ మెన్లను దించేసి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిలతో వెళ్ళగా ఓడిపోయిన సరితా తిరుపతయ్యను ఎలా ఎంకరేజ్ చేస్తారంటూ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వాదనకు దిగినట్లు తెలిసింది.కోపంతో ఊగిపోయిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెంప మీద కొట్టిన మల్లు రవి కొట్టగా.. తానేం తక్కువ తినలేదు అంటూ ఎంపీ మీద దాడి చేసిన ఎమ్మెల్యే దాడి చేశారు. ఊహంచని పరిణామంతో మంత్రి పొంగులేటి కారులో ముందు కూర్చోని మౌనంగా ఉండిపోయాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news