పశ్చిమ బెంగాల్ లో గత కొంత కాలంగా ఆర్మీ చర్యలపై ఆగ్రహంగా ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేసారు. తాజాగా అర్మీని లక్ష్యంగా చేసుకుని ఆమె ఆరోపణలకు దిగారు. అనవసరంగా బోర్డర్ సెక్యురిటి ఫోర్స్, జవాన్లు బెంగాల్ గ్రామాల్లోకి అడుగు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. మతపరమైన అంశాల్లో వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు అని ఆమె మండిపడ్డారు.
లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రాలకు సంబంధించిన విషయమని అన్నారు. బెంగాల్ గ్రామాల్లోకి జవాన్లు అడుగుపెడితే పరిస్థితులు మారతాయని ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మతపరమైన అంశాల్లో వాళ్ళు జోక్యం చేసుకోవద్దు అని హితవు పలికారు. గత కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆర్మీ ద్వారా తనను టార్గెట్ చేస్తుందని మమత ఆగ్రహంగా ఉన్నారు.
ఇప్పుడు మరోసారి జవాన్లు గ్రామాల్లోకి అడుగు పెట్టడంతో ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇక పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కూడా మమతను బిజెపి టార్గెట్ చేసింది. బెంగాల్ లో అలజడి సృష్టించడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తుందని, బెంగాల్ లో ఎన్నార్సి గాని ఎన్పిఆర్ గాని అమలు చేసే అవకాశం లేదని ఆమె స్పష్ట౦ చేసారు. తాజాగా బెంగాల్ పర్యటనకు వెళ్ళిన అమిత్ షా ఎవరు ఎం చేసినా సరే అమలు చేసి తీరతామని స్పష్టం చేసారు.