సౌతిండియాలోనే ఫస్ట్ టైమ్.. ఇదంతా ఆయన వల్లే : తమన్

-

అల వైకుంఠపురములో సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే.. మొదటగా అందులోని పాటల గురించే మాట్లాడాలి. అంతకంటే ముందుగా అంతటి అద్భుతమైన బాణీలందించిన తమన్ గురించి ఓ రెండు మాటలైనా మాట్లాడుకోవాలి. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడటానికి తమన్ అందించిన ఆ సంగీతమే ప్రధాన కారణం. ఒక్కో పాటను అలా రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేశాడు.

సామజవరగమన అనే పాట రెండు తెలుగు రాష్ట్రాలను తన మాయలో పడేసుకుంటే.. రాములో రాముల అనే సాంగ్ వచ్చి అందర్నీ తనవైపుకు తిప్పుకుంది. సరేలో రెండు ఒకే సినిమాలోవి కదా అని సర్దుకుంటే.. ఓ మైగాడ్ డ్యాడీ, బుట్టబొమ్మ, అల వైకుంఠపురములో, సిత్తరాల సిరపడు ఇలా ఒకదాన్ని మించి మరో పాట వస్తుంటే ఉక్కిరిబిక్కిరిగా పరిస్థితి మారింది. ఇక యూట్యూబ్‌కైతే కునుకన్నది లేకుండా పోయింది.

వంద మిలియన్ల పాటలను అందించిన ఘనత తమన్‌కు మాత్రమే దక్కింది. జియో సావన్ సంస్థలో వంద మిలియన్ల ఆల్బమ్‌గా సౌత్ ఇండియా నుంచి ఎంపికైన మొదటి చిత్రంగా అల వైకుంఠపురములో నిలిచింది. ఈ మేరకు తమన్ ట్వీట్ చేస్తూ.. ఆరు పాటలకు ఆరు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అంటే అది ఏ ఒక్కరి కష్టమో కాదు.. ఇలాంటి రేర్ ఫీట్‌ను అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ.. ఇదంతా త్రివిక్రమ్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news