ఎప్పుడైనా ఉదయం లేచిన వెంటనే ఎంతో ప్రశాంతకరమైన వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, కొన్ని పొరపాట్లను ఉదయం నిద్ర లేచిన వెంటనే చేయడం వలన సంతోషంగా ఉండలేరు. కనుక ఇటువంటి పొరపాట్లను ఉదయాన్నే అస్సలు చేయకండి. చాలా శాతం మంది రోజంతా ఎంతో బాగుండాలని అనుకుని, దేవుడికి దండం పెట్టుకొని నిద్రలేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాలలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజంతా ఎంతో సంతోషంగా ఉండాలంటే ఈ తప్పులను అస్సలు చేయకూడదు. నిద్రలేచిన వెంటనే చీపురు కట్టను చూడడం వలన అస్సలు మంచిది కాదు.
అంతే కాకుండా ఉదయాన్నే చీపురు కట్టను ముట్టుకోకూడదు. ఎప్పుడైతే నిద్రలేచిన వెంటనే చీపురు కట్టను ముట్టుకుంటారో, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చాలా శాతం మంది ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి చాలా ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో ఆనందంగా ప్రారంభించాలి. ముఖ్యంగా గొడవ పడడం, ఏడవడం వంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడైతే ఇటువంటి పనులతో మీ రోజును ప్రారంభిస్తారో, రోజంతా ఎంతో చిరాకుగా ఉంటుంది.
సహజంగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ లేవగానే మొబైల్ ఫోన్ ను చూస్తూ ఉంటారు. దీని వలన ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ధ్యానం, యోగా, పూజ వంటి పనులను చేయాలి. ఇవి సానుకూల శక్తిని పెంచుతాయి. కనుక వీటికి కొంత సమయాన్ని కేటాయించడం ఎంతో అవసరం. ఎప్పుడైతే ఇటువంటి పొరపాట్లను చేయకుండా ఉంటారో ఇంట్లో ఉండే సానుకూల శక్తి పెరుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటివి పూర్తిగా తొలగిపోయి ఎంతో ప్రశాంతంగా జీవించవచ్చు.