తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్ అయ్యింది. ఇవాళ తెలంగాణలోని 21 జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు దాదాపు 40 కి. మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

కొన్ని చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.