హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పు ఉంటుంది. 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్‌లో పలు పోలీస్ స్టేషన్లు, డివిజన్ల పేర్లు మార్పు ఉంటుంది. సెక్రటేరియట్ పీఎస్ – లేక్ పోలీస్ స్టేషన్‌గా, హుమాయున్ నగర్ పీఎస్ – మెహదీపట్నం పీఎస్‌గా పేర్లు మార్చుతున్నట్లు తెలిపారు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.

షాహినాయత్ గంజ్ పీఎస్ – గోషామహల్ పీఎస్ గా పేర్లు మార్చుతున్నట్లు పేర్కొన్నారు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్. హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని పేర్లు మారుస్తున్నట్లుగా తెలిపారు సీవీ ఆనంద్. నగరంలో 71 లా అండ్ ఆర్డర్, 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నట్లుగా తెలిపారు కమిషనర్ సీవీ ఆనంద్.