నిన్న అక్షయ తృతీయ రోజు దేశంలో 20 టన్నుల బంగారం అమ్మకాలు జరిగాయి. అంటే నిన్న ఒక్క రోజే 18 వేల కోట్లు విలువైన బంగారం విక్రయాలు జరిగాయి. నిన్న అక్షయ తృతీయ రోజు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. గోల్డ్ ETFలపై వైపు జనం మొగ్గు చూపారని బులియన్ మార్కెట్ తేల్చింది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 218 తగ్గి, రూ. 95, 730 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి, రూ. 87, 750 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 2000 తగ్గి రూ.1,07,000గా నమోదు అయింది.