అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కార్మిక కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఈ సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారికి దేశం పట్ల ఉన్న అంకితభావం అనితర సాధ్యమని అభివర్ణించారు.
కార్మికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కొనియాడారు.ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం కృషి చేయాలని.. వారి సంక్షేమం కోసం కొత్త పథకాలను తీసుకురావాలని కేసీఆర్ సూచించారు.