పోలీసు యంత్రాంగం ఎంత పటిష్టంగా ఉన్నా నేరస్తులు,దొంగలు వారికి మస్కా కొడుతూనే ఉన్నారు. టెక్నాలజీ ఎంత ప్రసిద్ధి చెందినా.. నేరం చేసిన వారిని గంటల్లోనే పోలీసులు పట్టుకుంటున్నా నేటికి కొందరు క్రిమినల్స్ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏకంగా పోలీసు వ్యవస్థకే వారు సవాల్ విసురుతున్నారు.
తాజాగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ నేరస్తుడు ఏకంగా పోలీసుల నుండి చాకచక్యంగా తప్పించుకొని పారిపోయాడు. ఓ దాడి కేసులో నిందితుడుగా ఉన్న క్రిష్ షిండే.. కోర్టులో హాజరుపరిచిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తుండగా పోలీసులను తోసేసి తప్పించుకున్నాడు. అప్పటికే రోడ్లుపై క్రిష్ కోసం వెయిట్ చేస్తున్న ఓ వ్యక్తి స్కూటీ మీద రన్నింగ్ లోనే జంప్ చేసి సీటు మీదకు దూకాడు. వెంబడిస్తూ వచ్చిన ఓ పోలీసు కింద పడిపోగా.. మరో ఇద్దరు బైక్ వెంట పరిగెత్తుతున్న వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర – నాసిక్‌లో పోలీసుల నుండి తప్పించుకొని పారిపోయిన నిందితుడు క్రిష్ షిండే
ఒక దాడి కేసులో కోర్టులో హాజరుపరిచి, పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తుండగా పోలీసులను తోసేసి తప్పించుకున్న క్రిష్ షిండే. pic.twitter.com/OVBkywDVvt
— ChotaNews App (@ChotaNewsApp) May 1, 2025