తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. సాదాబైనామాలకు పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నారు. సాదాబైనామాలతో కొనుగోలు చేసిన భూములకు త్వరలోనే పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ప్రతీ రైతుకూ ఆధార్ కార్డు తరహాలో భూధార్ కార్డులు ఇవ్వనున్నారు.

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి, రాజంపేట, తాడ్వాయి మండల కేంద్రాల్లో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.. ఈ మేరకు ప్రకటన చేశారు. సాదాబైనామాలకు పాస్ పుస్తకాలు ఇవ్వబోతుని చెప్పారు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.