దేశవ్యాప్తంగా కాసేపట్లో నీట్ పరీక్ష ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో జరగనున్న నీట్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీలోని పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతతో పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగాయి. ఈ ఏడాది 65 వేలకు పైగా విద్యార్థులు నీట్ రాయనున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. కఠిన ఆంక్షల నడుమ నీట్ పరీక్ష జరగుతోంది. విజయవాడ, కర్నూలు, తిరుపతి, విశాఖ, అనంతపురం, గుంటూరులో అధికారులు నీట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి నీట్ పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతిస్తున్నారు.విద్యార్థులు ధరించే దుస్తుల నుంచి గోల్డ్, పాదరక్షలు వరకు తనిఖీలు చేస్తున్నారు.నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేయనున్నట్లు సమాచారం.