టీటీడీకి భారీ విరాళం వచ్చింది. తిరుమల ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళం అందింది. టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తన క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం అందజేసింది బెంగుళూరుకి చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్.ఎల్.పి కంపెనీ. విరాళం చెక్కును అందజేసింది కంపెనీ ఛైర్మన్ యతిష్ సూరినేని.

తిరుమలలో విశాంత్రి భవనాల పేర్లపై కీలక నిర్ణయం తీసుకుంది టిటిడి పాలక మండలి. తిరుమలలో విశాంత్రి భవనాల పేర్లు మార్పు ప్రారంభం అయింది. తిరుమలలో వసతి గృహాలకు దాతలు తమ సొంత పేర్లను పెట్టుకోరాదంటూ టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం.. ఇందులో భాగంగా వసతిగృహాల పేర్లు మార్పు చేస్తోంది.