తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. వేసవి సెలవుల కారణంగా తిరుపతికి చాలామంది భక్తులు పోటెత్తుతున్నారు. వేసవికాలంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టీటీడీ సంస్థ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తిరుపతి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ త్వరలోనే మరో శుభవార్త చెప్పమంది. భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ వాహనాలను ఫ్రీగా నడపనున్నారు. ఈ వాహనాలలో తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు భక్తులను ఎలక్ట్రిక్ వాహనాలలో తీసుకెళ్లాలని టిటిడి సంస్థ నిర్ణయించుకున్నారు.

త్వరలోనే నిర్వహించే టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో బస్సుల కొనుగోలుపై నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా…. వేసవి ఎండలలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమలలో అనేక రకాల ఏర్పాట్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నీటి సదుపాయం, వైద్య సదుపాయం, భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. దీంతో ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు.