కరోనా రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పిన మంతెన…!

-

దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో ప్రతీ ఒక్కరు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడింది. చిన్న అనుమానం వచ్చినా సరే ప్రజలు ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు. జలుబు చేసినా దగ్గు వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది.

ఇక దీనిపై మీడియా చేస్తున్న హడావుడి కూడా ప్రజలను అయోమయానికి గురి చేస్తుంది. ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హైఅలెర్ట్ ప్రకటించాయి. ప్రజలు కూడా భారీగా మాస్క్ లు కొనుగోలు చేస్తున్నారు. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో ఈ తరహా అంటు వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకుంటే, వ్యాధులు దరిచేరవని ప్రముఖ ప్రకృతి వైద్యులు, మంతెన సత్యనారాయణ రాజు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి రాకుండా ఉండాలంటే, శరీరంలో రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలని అప్పుడే మనకు జబ్బులు దరిచేరవని, విటమిన్ సి మన ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటేనే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అప్పుడే కరోనా లాంటి మహమ్మారితో పోరాడవచ్చని, శరీరంలో కణజాలం ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా విటమిన్ సీ కాపాడుతుందని ఆయన సూచిస్తూ వీడియో విడుదల చేసారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news