జగిత్యాల జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. నీట్ పరీక్షలో మంచి మార్కులు రావనే భయంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామానికి చెందిన జంగా పూజ (18) అనే విద్యార్ధిని 2023లో నీట్ పరీక్ష రాయగా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని నిన్న మరొకసారి నీట్ పరీక్ష రాసింది.

ఈ సారి కూడా సరైన ర్యాంకు రాద నే భయం తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది పూజ. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు కు చెందిన రాయి మనోజ్ కుమార్ నీట్ పరీక్ష బాగా రాయలేదని మనస్తాపంతో ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.