టాలీవుడ్ ఇండస్ట్రీలో బలగం సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించిన బలగం నటుడు మంచం పట్టాడు. బలగం సినిమాలు అంజన్న పాత్రలో నటించిన నటుడు జీవి బాబు మంచం పట్టారని తెలుస్తోంది. మూత్రపిండాల సమస్య కారణంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందుతుంది.

బలగం సినిమాతో పేరు వచ్చినా కూడా ఆ పెద్దగా డబ్బు అలాగే అవకాశాలు రాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరంగల్లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో డయాలసిస్ ఆయనకు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఇక బలగం నటుడు అంజన్న పాత్ర చేసిన జీవి బాబును ఆదుకోవాలని ఆర్థిక సహాయం కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్నారు.