వైసీపీ పార్టీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు. వైసీపీ పార్టీ ఎమ్యెల్యే వల్లభనేని వంశీతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు.
ఇది ఇలా ఉండగా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. నడుము నొప్పి, వాయు తలెత్తడంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెజవాడలోని ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. .